శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 మార్చి 2022 (16:10 IST)

చెన్నై మేయరుగా తొలి దళిత మహిళ

చెన్నై మహానగరానికి తొలి మహిళా మేయర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె పేరు ప్రియ. ఇటీవల జరిగిన నగరపాలక ఎన్నికల్లో అధికార డీఎంకే పార్టీ తిరుగులేని విజయాన్ని దక్కించుకుంది. దీంతో చెన్నే మేయరుగా 29 యేళ్ళ ఆర్.ప్రియ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో చెన్నై మేయరుగా తొలి దళిత మహిళ రికార్డులు సృష్టించారు. 
 
అంతేకాకుండా, మేయరుగా బాధ్యతలు చేపట్టిన అతిపిన్నవయస్కురాలు కావడం గమనార్హం. మొత్తంగా చెన్నై మేయర్ అయిన మూడో మహిళగా ఆమె నిలిచారు. గతంలో తారా చెరియన్, కామాక్షి జయరామన్‌లు చెన్నై మేయరుగా పనిచేశారు. 21 యేళ్ళ ప్రియదర్శిని 74వ వార్డు తిరు.వి.క నగర్న నుంచి గెలుపొందారు. ఈమె ఉత్తర చెన్నై జిల్లా వాసి. ఈ జిల్లా నుంచి ఎంపికై తొలి మేయర్ కూడా కావడం గమనార్హం. 
 
కాగా, గ్రేటర్ చెన్నై మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 200 వార్డులు ఉండగా, ఇందులో డీఎంకే 153, అన్నాడీఎంకే 15, కాంగ్రెస్ 13, స్వతంత్రులు 5, సీపీఎం 4, వీసీకే 4, బీజేపీ ఒక చోట గెలిపొందాయి.