1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Sajjala Ramakrishna Reddy comments on TDP formation day

తెదేపా 40 యేళ్ల సంబరాలు కాదు.. 27 యేళ్ల సంబరాలు...

TDP Formation Day
తెలుగుదేశం పార్టీ 40 యేళ్ళ ఆవిర్భావ వేడుకలు మంగళవారం జరుపుకుంటుంది. ఈ వేడుకలపై ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సెటైర్లు వేశారు. టీడీపీ 40 యేళ్ల సంబరాలు కాదని 27 యేళ్ల సంబరాలు అంటూ వ్యాఖ్యానించారు. పైగా, దానికి వివరణ కూడా ఇచ్చారు. 
 
"నాడు టీడీపీ పుట్టుకను ఓ రాష్ట్రానికి సంబంధించిన ప్రజాస్వామ్యపరంగా ప్రాధాన్యత ఉన్న ఘట్టంగా చెప్పుకోవచ్చన్నారు. అయితే, ప్రజాభిమానంతో అత్యధిక సీట్లు గెలుచుకుని అధికారం చేపట్టిన ఎన్టీఆర్ గారిని 1995లో చంద్రబాబు గద్దె దింపారని గుర్తుచేశారు. చంద్రబాబు తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారని గుర్తుచేశారు. 
 
ఎమ్మెల్యేలను మభ్యపెట్టి ఈనాడు అధినేత రామోజీరావు మద్దతుతో కుట్ర చేశారని ఆరోపించారు. టీడీపీ ప్రస్థానంపై ఎవరైనా పరిశోధించి చేయదలచుకుంటే ఇక్కడ నుంచే చూడాలని కోరారు. ఎన్టీఆర్, టీడీపీ అనే కోణంలో చూసేవారు 1995-2022 మధ్య ఏం జరిగిందనేది కూడా చూడాలని, ప్రధానంగా టీడీపీ చరిత్ర అంటే ఈ 27 యేళ్లలో జరిగిందే.. ఇదే మా పార్టీ ఉద్దేశం" అని చెప్పారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
మైబిల్‌బుక్‌ పైన స్మార్ట్‌ కలెక్ట్‌ను విడుదల చేయడం ద్వారా ఎస్‌ఎంబీల కోసం బ్యాంకింగ్‌ సేవల్లోకి ప్రవేశించిన ఫ్లోబిజ్‌