శనివారం, 9 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 మార్చి 2022 (10:42 IST)

ఏప్రిల్‌ 11న AP EAPCET నోటిఫికేషన్‌ విడుదల

ఏపీ EAPCET ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌2022 షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ ఏప్రిల్ 11న విడుదలకానుంది. ఆగస్టు 15 తర్వాత ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. 
 
ఎగ్జాం ప్యాట్రన్‌, ర్యాంకుల విధానంలో ఎటువంటి మార్పులులేవని, గత ఏడాది మాదిరిగానే ఉంటుందని, సెప్టెంబర్‌ రెండో వారంలోగా తరగతులు ప్రారంభించేందుకు అనుగుణంగా షెడ్యూల్‌ తయారు చేసినట్లు ఏపీ విద్యాశాఖ తెల్పింది.
 
ఇకపోతే.. జూలై 4 నుంచి 8 వరకు మొత్తం 5 రోజుల పాటు, మొత్తం 10 సెషన్లలో ఇంజినీరింగ్‌ పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. 
 
అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాలకు సంబంధించిన పరీక్షలు జులై 11, 12 తేదీల్లో 4 సెషన్లలో జరగనున్నాయి.