శుక్రవారం, 14 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 31 మార్చి 2022 (12:48 IST)

కోర్టు ధిక్కరణ : ఏపీలో 8 మంది ఐఏఎస్‌లకు జైలుశిక్ష

కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎనిమిది ఐఏఎస్‌ అధికారులు ఆ రాష్ట్ర హైకోర్టు జైలుశిక్షలు విధించింది. దీంతో శిక్షపడిన అధికారులు హైకోర్టును క్షమాపణలు చెబుతూ వేడుకున్నారు. ఫలితంగా జైలు శిక్షను తప్పించి ఇతర సేవా కార్యక్రమాలు చేయవలసిందిగా ఆదేశాలు జారీచేసింది. 
 
తమ ఆదేశాలను లెక్క చేయని ఐఏఎస్ అధికారులపై ఇటీవలి కాలంలో హైకోర్టు కన్నెర్ర జేస్తున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, ఏకంగా ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష, జరిమానా విధించింది. కోర్టు ధిక్కరణ కింద 2 వారాల జైలుశిక్ష కూడా విధించింది. 
 
ఈ నేపథ్యంలో వీరంతా హైకోర్టును క్షమాపణలు కోరారు. దీంతో వీరికి జైలుశిక్ష నుంచి విముక్తిని కలిగించిన న్యాయస్థానం సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించింది. ఒక రోజు పాటు కోర్టు ఖర్చులు భరించాలని ఆదేశాలు జారీచేసింది. 
 
సంక్షేమ హాస్టళ్ళలో యేడాది పాటు నెల లో ఒక రోజు సేవ చేయాలని స్పష్టం చేసింది. కాగా, జైలుశిక్ష పడిన ఐఏఎస్ అధికారుల్లో గోపాలకృష్ణ ద్వివేదీ, గిరిజా శంకర్, రాజశేఖర్, చిన వీరభద్రుడు, జే.శ్యామలరావు, విజయ్ కుమార్, ఎంఎం నాయక్, శ్రీలక్ష్మిలు ఉన్నారు.