శుక్రవారం, 3 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 ఏప్రియల్ 2022 (10:45 IST)

కోహ్లీ సెంచరీ చేస్తేనే డేటింగ్.. ఆర్సీబీ ట్రోఫీ గెలిస్తేనే పెళ్లి..

RCB
RCB
ఐపీఎల్ 2022,12వ మ్యాచ్‌లో చెన్నై ఆర్సీబీపై నెగ్గింది. ఈ మ్యాచ్‌లో విజయంతో సీఎస్కే తొలి బోణీ చేసింది. ఈ మ్యాచ్‌లో సీఎస్కే అద్భుత ప్రదర్శన, అంబటి రాయుడు అత్యద్భుత క్యాచ్ ఇవేవీ చర్చనీయాంశం కాలేదు గానీ..ఆ అమ్మాయి పోస్టర్ మాత్రం హల్‌చల్ చేస్తోంది. 
 
ఇప్పటికే మొన్న ఆర్సీబీ వర్సెస్ లక్నో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ క్రేజ్ చూపించింది ఓ అమ్మాయి. కోహ్లీ సెంచరీ చేసేవరకూ డేటింగ్ చేయనంటూ ఏకంగా అందరి ముందూ స్డేడియంలో బ్యానర్ ప్రదర్శించి కెమేరాలకెక్కింది. ఈ ఘటన మరవక ముందే మరో అమ్మాయి ఆర్బీబీ ట్రోఫీ గెలిచేవారికి పెళ్లి చేసుకోనని శపథం చేసింది. 
 
చెన్నై సూపర్‌కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్‌లో ఓ అమ్మాయి ఫోస్టర్‌తో స్డేడియంలో అడుగెట్టింది. మ్యాచ్ జరుగుతుండగా..ఆ పోస్టర్ ప్రదర్శించింది. అందులో రాసిన కంటెంట్ అందర్నీ ఆకర్షిస్తోంది. ఆర్సీబీ జట్టు ఐపీఎల్ ట్రోఫీ గెలిచే వరకూ పెళ్లి చేసుకోనంటూ శపధం చేసింది ఓ అమ్మాయి. 
 
ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్రౌండ్‌లో అందరి దృష్టి కెమేరాలన్నీ ఆ పోస్టర్‌పైనే ఫోకస్ చేశాయి. ఆర్సీబీ ప్రదర్శన బాగానే ఉన్నా.. ట్రోఫీ మాత్రం సాధించలేకపోతోంది. 
 
మరి ఆర్సీబీ ఎప్పుడు ట్రోఫీ సాధిస్తుంది..ఆ అమ్మాయి ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంది. మొత్తానికి ఓ అమ్మాయి డేటింగ్ విరాట్ కోహ్లీ సెంచరీతో లింకై ఉంటే.. మరో అమ్మాయి పెళ్లి ఆర్సీబీ ట్రోఫీ విన్నింగ్‌తో ఆధారపడి ఉంది. అయితే ఈ వార్తలపై మీమ్స్ పేలుతున్నాయి.