ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (19:07 IST)

పల్లెటూరి ప్రేమ కథగా ఈశ్వర్ మ్యారేజ్ ఇందుతో

Mayukha, Kamal Kalyan, Sri Venkat
Mayukha, Kamal Kalyan, Sri Venkat
Mayukha, Kamal Kalyan, Sri Venkat
శ్రీ సీతారామచంద్ర ఆశీస్సులతో కివీ పాప సమర్పణలో కమల్ కళ్యాణ్ మూవీ మేకర్ పతాకంపై శ్రీ వెంకట్, మయూఖ (నూతన పరిచయం) జంటగా మా కమల్ కళ్యాణ్ దర్శకత్వంలో మూర్తి జంగిలి నిర్మిస్తున్న చిత్రం ఈశ్వర్ మ్యారేజ్ ఇందుతో. ఈ చిత్రం షూటింగ్ పూజా కార్యక్రమాలు హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరుపుకుంది. 
ఈ కార్యక్రమానికి .ముఖ్య అతిధులుగా వచ్చిన విరాటపర్వం సినిమా దర్శకులు వేణు ఉడుగుల హీరో,హీరోయిన్లపై తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, జార్జిరెడ్డి సినిమా దర్శకులు జీవన్ రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్క్రిప్ట్, గౌరవ దర్శకత్వం వహించారు. 
 
అనంతరం చిత్ర దర్శకుడు కమల్ కళ్యాణ్ మాట్లాడుతూ..  దర్శకులు వేణు ఉడుగుల దర్శకుడు జీవన్ రెడ్డి, గీత రచయిత మిట్టపల్లి సురేందర్ అన్న వీరందరూ ప్రోత్సహించడంతో నేను సినిమా చేయడానికి ముందుకు వచ్చాను. ఇందులో శ్రీ వెంకట్, మయూఖను ఇండస్ట్రీ కు పరిచయం చేస్తున్నాము .నేను పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఒక పాట రాశాను..ఈ పాట‌ కోట్లాది మందికి రీచ్ అయింది. ఇప్పుడు "ఈశ్వర్ మ్యారేజ్ ఇందుతో" వస్తున్న మేము పక్కా తెలంగాణ యాసతో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం.ఇ ది ప్రతి ఒక్క ఇళ్లలో జరిగే కథ. ఎక్కడా అశ్లీలం ఉండకుండా బోల్డ్ డైలాగ్స్ లేకుండా ఈ సినిమా నీట్ తెరకెక్కిస్తున్నాం. కొమరం భీమ్ జిల్లాలోనే దహెగాంలో షూటింగ్ చేసుకుంటున్న ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్‌లో 45 రోజుల పాటు షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో నాలుగు పాటలు,నాలుగు ఫైట్స్ ఉంటాయి.ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా అందరికీ మీ ఆశీర్వాదాలు కావాలని  మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
 
Ishwar Marriage Indu opening
Ishwar Marriage Indu opening
చిత్ర నిర్మాత మూర్తి జంగిలి మాట్లాడుతూ.. నాకు ఇండస్ట్రీ కొత్త .అయితే తమ్ముడు కమల్ కళ్యాణ్ విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో జరిగే బ్యూటిఫుల్ లవ్ స్టొరీ చెప్పడం జరిగింది. ఈ లైన్ నచ్చి నేను సినిమా చేయడానికి ముందుకు వచ్చాను. బెల్లంపల్లి అనేది కోల్డ్ బెల్ట్ ఏరియా.ఇది పూర్తి మాస్ ఏరియా అలాంటి ఏరియా నుంచి కళ్యాణ్ లాంటి  ఆణిముత్యం ఇండస్ట్రీ కి రావడమే కాక మమ్మల్ని కూడా పరిచయం చేస్తున్నాడు.మీ అందరి ఆదరాభిమానాలు లభించేలా మమ్మల్ని ప్రోత్సహించాలని మనస్పూర్తిగా కోరుతున్నాం అన్నారు 
 
గీత రచయిత మిట్టపల్లి సురేందర్ మాట్లాడుతూ..మంచి కథతో పాటు ఇందులోని పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి.విలేజ్ బ్యాక్ డ్రాప్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
 
మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ కొడగండ్ల మాట్లాడుతూ.. మన కళ్ళ ముందు జరిగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లో  కథ ఇది.ఈ సినిమాకు నిర్మాత పెట్టిన ప్రతి పైసా వసూల్ అవుతుంది. ఇందులో నాలుగు పాటలుంటాయి ప్రతి పాట  సినిమాల్లో సిచువేషన్ పరంగా వస్తుంది.అర్ధవంతమైన సాహిత్యం, అర్ధవంతమైన సంగీతం ఇందులో ఉంటుంది. కొత్తదనం కోరుకునే వారికి ఈ సినిమా చేరువ అవుతుందని  ఖచ్చితంగా చెప్పగలను అన్నారు 
 
హీరో శ్రీ వెంకట్ మాట్లాడుతూ .. నాకిది తొలి సినిమా ఇందులో ఈశ్వర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ఇలాంటి మంచి సినిమాలో హీరోగా చేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
 
హీరోయిన్ మయూఖ మాట్లాడుతూ.. ఇందులో ఇందుగా పరిచయం అవుతున్న నన్ను దర్శకుడు నా కళ్ళు చూసి సెలెక్ట్ చేశారు.ఈ కథ చాలా బాగుంది. దర్శకుడు నా పైన పెట్టుకున్న నమ్మకాన్ని నేను హండ్రెడ్ పర్సెంట్  ఫుల్ ఫీల్ చేస్తానని అన్నారు. 
 
డి.ఓ.పి బ్రాడీ మాట్లాడుతూ.. కొత్త కథ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు.
 
నటీనటులు
ఈశ్వర్,ఇందు తదితరులు 
సాంకేతిక నిపుణులు
బ్యానర్ : కమల్ కళ్యాణ్ మూవీ మేకర్స్ 
స్టోరీ,స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ : మా కమల్ కళ్యాణ్
నిర్మాత : మూర్తి జంగిలి 
మ్యూజిక్ : కార్తీక్ బి కొడకండ్ల 
సినిమాటోగ్రఫీ : బ్రాడీ 
ఎడిటర్ : జయంత్ ఎంజె 
లిరిక్స్ : మిట్టపల్లి సురేందర్ 
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : రాజ వంశీ 
పి ఆర్ ఓ: జెమిని శ్రీనివాస్