నేడు రథసప్తమి వేడుకలు - ముస్తాబైన తిరుమల
రథసప్తమి వేడుకలు మంగళవారం జరుగుతున్నాయి. ఈ వేడుకల కోసం ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అలాగే, ఈ వేడుకల కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఈ వేడుకలను కోవిడ్ -19 నిబంధనలను అనుసరించి ఏకాంతంలో రథ సప్తమి వేడుకలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ఫిబ్రవరి 8వ తేదీన జరిగే రథసప్తమి వేడుకల్లో పాల్గొనేందుకు భక్తులను అనుమతించబోమని తితిదే అధికారులు ఇప్పటికే ప్రకటించారు.
కాగా తిరుమలతో రథసప్తమి ఉత్సవాలను ఏకాంతంగా టీటీడీ నిర్వహించడం ఇదే తొలిసారి. ప్రతి సంవత్సరం సూర్యభగవానుడు సూర్య జయంతి సందర్భంగా రథ సప్తమిని మినీ బ్రహ్మోత్సవం అని కూడా పిలుస్తారు. దీన్ని పురస్కరించుకుని సప్త వాహన సేవలను కూడా నిర్వహిస్తారు. అయితే, కోవిడ్ ఆంక్షల కారణంగా ఈ వేడుకలను ఏకాంతంగా నిర్వహించనున్నారు.