శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 జనవరి 2022 (13:32 IST)

శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. జనవరి 11 రాత్రికల్లా..?

శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డును అందుబాటులోకి తేనుంది. జనవరి 9న ఘాట్ రోడ్డులో జరుగుతున్న మరమ్మతు పనులను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జనవరి 11 రాత్రికల్లా ఘాట్ రోడ్డును భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. 
 
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలను శోభాయమానంగా అలంకరిస్తున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. స్వామివారిని భక్తులు దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే భారీ వర్షాల కారణంగా గత నెలలో ఘాట్ రోడ్డు వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో మరమ్మత్తుల కోసం ఘాట్ రోడ్డులను మూసివేశారు. 
 
అంతేగాకుండా ఘాట్‌ రోడ్డు మరమ్మతులు శరవేగంగా పూర్తి చేశారు. రేపటి నుంచి రెండో ఘాట్ రోడ్డు మీద నుంచి వాహనాల రాకపోకలను అనుమతిస్తున్నారని టీటీడీ ఛైర్మన్ తెలిపారు.