1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Rajendra Prasad's special video on MGR spark backlash

చెన్నై కోడంబాక్కం దెబ్బకు దిగివచ్చిన నట కిరీటి...

rajendra prasad - mgr
పురట్చితలైవర్ దివంగత ఎంజీఆర్‌ను తాను దైవంలా భావిస్తానని, తెలుగు గొప్ప నటుడు కాంతారావును ప్రశంసించే క్రమంలో కాస్త నోరు జారానని, తన వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించివుంటే క్షమాపణలు కోరుతున్నట్టు ప్రముఖ టాలీవుడ్ నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తమిళ లెజెండరీ నటుడు ఎంజీఆర్‌ను ప్రస్తావిస్తూ తాను చేసిన వ్యాఖ్యలు పొరపాటేనని, అయితే, అవి ఉద్దేశ పూర్వకంగా చేసినవి కావని, అనుకోకుండా దొర్లాయని విచారం వ్యక్తం చేశారు. 
 
ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలుగు నటుడు కాంతారావును ప్రశంసించే క్రమంలో ఎంజీఆర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంతారావును చూసి ఎంజీఆర్‌ భయపడేవారని అన్నారు. ఈ కామెంట్స్ సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో తమిళంలో క్షమాపణలు చెబుతూ రాజేంద్రప్రసాద్‌ వీడియోను విడుదల చేశారు.
 
'తమిళ సినీ ప్రేక్షకుల మాదిరిగానే నేనూ ఎంజీఆర్‌ను దైవంలా భావిస్తా. తెలుగు నటుడు కాంతారావును ప్రశంసించే క్రమంలో నోరుజారాను. అయితే, అవి ఉద్దేశ పూర్వకంగా చేసినవి కావు. కొందరు ఈ అంశాన్ని పెద్దది చేశారు. ఆయనపై వ్యాఖ్యలు చేసేంత ధైర్యం నాకుందా? నేను చెన్నై ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో ఉండగా, ఆయన సీఎంగా ఉన్నారు. మేము నటిస్తుంటే వచ్చి చూసేవారు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి నేను మాట్లాడగలనా? నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంేటే క్షమించండి. భవిష్యత్‌లో ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పుడూ చేయను' అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. 
 
అంతకుముందు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై తమిళ నటులు విశాల్‌, నాజర్‌లు అసహనం వ్యక్తం చేశారు. ఎంజీఆర్ గురించి చౌకబారు పోలికతో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడటం దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రతి తమిళుడి మనసును నొచ్చుకునేలా చేశాయన్నారు. రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ చెప్పాలని నటుడు విశాల్ డిమాండ్‌ చేశారు. Adver
తర్వాతి కథనం
Revanth Reddy: లారీల్లో వెళ్ళి సినిమా చూసేవాడ్ని - సినిమాను ఇండస్ట్రీగా గుర్తిస్తాం : రేవంత్ రెడ్డి