1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. 5 drinks that help prevent the formation of kidney stones, what are they

కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించే 5 పానీయాలు, ఏంటవి?

coconut water
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా శరీరాన్ని నిరంతరం హైడ్రేటెడ్‌గా ఉంచడం, బిలిరుబిన్-కాల్షియం ఆక్సలేట్ స్పటికాలు కలవకుండా చేసే 5 ఉత్తమమైన పానీయాలు ఏమిటో, వాటిని తీసుకుంటే మూత్రపిండాలకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
నిమ్మకాయ నీళ్లు: నిమ్మకాయలో సిట్రేట్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రాయిలా మారే కాల్షియం స్పటికాలను కరిగిస్తుంది. కొత్త రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. రోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో సగం నిమ్మచెక్క రసం పిండుకుని తాగడం చాలా మంచిది.
 
కొబ్బరి నీళ్లు: కొబ్బరి నీళ్లలోని పొటాషియం, మెగ్నీషియం, ఫ్లూయిడ్స్ మూత్రపిండాలను శుభ్రపరిచి ఆక్సలేట్ స్పటికాలను బయటకు పంపుతాయి. ఇది మూత్రంలో మంటను తగ్గించి నాచురల్ డైయూరెటిక్‌గా పనిచేస్తుంది.
 
బార్లీ నీళ్లు: బార్లీ గింజలను నీటిలో మరిగించి వడకట్టిన నీటిని తాగడం వల్ల మూత్ర విసర్జన పెరుగుతుంది. ఇది కిడ్నీలలో పేరుకుపోయిన వ్యర్థాలను, చిన్న చిన్న స్పటికాలను మూత్రం ద్వారా బయటకు తోసివేస్తుంది.
 
తులసి ఆకుల టీ- తులసి నీళ్లు: తులసిలో ఉండే ఎసిటిక్ యాసిడ్ కిడ్నీ రాళ్లను చిన్న చిన్న ముక్కలుగా కరిగించడానికి, నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది. నీటిలో 5-6 తులసి ఆకులు వేసి మరిగించి, ఆ నీటిని గోరువెచ్చగా తాగవచ్చు.
 
మామూలు మంచినీరు: ప్రపంచంలోనే కిడ్నీ రాళ్లకు అత్యంత ఉత్తమమైన ఔషధం మంచినీరు. రోజుకు కనీసం 3 నుండి 4 లీటర్ల మంచినీరు తాగడం వల్ల మూత్రం పలచబడి స్పటికాలు రాళ్లుగా మారే అవకాశమే ఉండదు.
 
ప్యాకేజ్డ్ జ్యూస్‌లు, సోడాలు, కూల్ డ్రింక్స్ మరియు పరిమితికి మించిన కెఫీన్ (కాఫీ-టీ) వంటి వాటికి దూరంగా ఉండాలి, ఎందుకంటే ఇవి శరీరంలో డీహైడ్రేషన్‌ను పెంచి రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి.
About Writer
జయ
Content provider.... మరింత చదవండి
తర్వాతి కథనం
విటమిన్ D లోపం, ఆరోగ్యంపై ప్రభావం