Herbal tea: వర్షాకాలంలో వేడి వేడి మసాలా టీని తాగితే?
Herbal tea
కావలసిన పదార్థాలు: 2 కప్పుల నీరు, దంచుకున్న అల్లం ఒక స్పూన్, 4-5 తాజా తులసి ఆకులు, దంచిన మిరియాలు - అరస్పూన్, చిన్న దాల్చిన చెక్క ముక్క 1, టీస్పూన్ తేనె లేదా బెల్లం, కొద్దిగా తాజా నిమ్మరసం.
తయారీ విధానం.. ఒక చిన్న పాత్రలో నీటిని మరిగించండి. అందులో దంచిన అల్లం, తులసి ఆకులు, మిరియాలు దాల్చిన చెక్క ముక్కను వేయండి. నీరు బాగా మరిగాక, సుగంధ ద్రవ్యాల రసం అందులో బాగా దిగేంతవరకు సన్నని సెగపై 5-7 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత దానిని ఒక కప్పులోకి వడకట్టి, అందులో తేనె (లేదా బెల్లం), నిమ్మరసం కలిపి, వేడిగా ఉన్నప్పుడే తాగండి.
ఈ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మధుమేహాన్ని దూరం చేస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. వర్షాకాలంలో ఏర్పడే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభించేలా చేస్తుంది.
