మంగళవారం, 2 డిశెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : గురువారం, 18 సెప్టెంబరు 2025 (16:25 IST)

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ రాబోతున్నట్లు స్పెషల్ వీడియో

Kiran Abbavaram, Yukthi Tareja
Kiran Abbavaram, Yukthi Tareja
కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా K-ర్యాంప్ రిలీజ్ కౌంట్ డౌన్ మొదలైంది. ప్రేక్షకులకు హెవీ ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చేందుకు మరో 30 రోజుల్లో ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ మూవీ 30 డేస్ కౌంట్ డౌన్ బిగిన్ చేసిన సందర్భంగా సినిమా మేకింగ్ నుంచి స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఆన్ లొకేషన్ లో ఎంత ఫన్ ఉందో ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. టీమ్ ఎంజాయ్ చేసిన ఇదే ఫన్ ను థియేటర్స్ లో ప్రేక్షకులకూ అందించబోతోంది.
 
హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్  బ్యానర్‌ల మీద రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా  నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా  అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.
నటీనటులు - కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా, నరేష్,సాయి కుమార్,వెన్నెల కిషోర్ తదితరులు