గురువారం, 11 సెప్టెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : బుధవారం, 10 సెప్టెంబరు 2025 (10:22 IST)

Yukthi Tareja : K-ర్యాంప్ నుంచి కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా పై లవ్ మెలొడీ సాంగ్

Kiran Abbavaram, Yukthi Tareja
Kiran Abbavaram, Yukthi Tareja
హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా K-ర్యాంప్. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్  బ్యానర్‌ల మీద సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా  నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. K-ర్యాంప్ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.
 
ఈ రోజు మ్యాజికల్ లవ్ సాంగ్ కలలే కలలే రిలీజ్ చేశారు. ఈ పాటను చైతన్య భరద్వాజ్ క్లాసీ ట్యూన్ తో కంపోజ్ చేయగా, కపిల్ కపిలన్ అందంగా పాడారు, భాస్కరభట్ల క్యాచీ లిరిక్స్ అందించారు. 'కలలే కలలే' పాట ఎలా ఉందో చూస్తే -  కలలే కలలే కనులకు నువు కనబడి కలలే, కథలే మొదలే వివరములే తెలియాలే, నా గుండెకేదో కబురే నీ వల్లే అందిందే, నీ చుట్టు చుట్టు తిరిగేలా చేసిందే,  నాతోటి ఉండే మనసే నా మాటే వినకుందే, నీతోటి జట్టే కడుతోందే కడుతోందే, అందాల మాయ కళ్లే కాదా, ఊసులేవో నాలో పూసగుచ్చేలా నన్నే అద్దంలో చూస్తుంటే నిన్నే చూపిస్తోందే, రోజంతా అద్దంతో ఇబ్బందే, యే నీ గుండే నాలోనే అందంగా దాక్కుందే, నాక్కొంచెం చోటైనా లేకుందే..' అంటూ మంచి లవ్ ఫీల్ తో సాగుతుందీ పాట.