బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 21 మార్చి 2022 (13:17 IST)

శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల.. వెబ్ సైట్ ద్వారా..?

ఏప్రిల్, మే, జూన్ నెలకుగాను ఆర్జిత సేవా టిక్కెట్లను తితిదే విడుదల చేసింది టీటీడీ. ఆర్జిత సేవా టిక్కెట్ల కోసం భక్తులు తితిదే అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇందులో సుప్రభాతం, తోమాల, అర్జన, అష్టదశ పాదపద్మారాధన, నిజపాద దర్శనం తదితర ఆర్జిత సేవా టిక్కెట్లు ఎలక్ట్రానిక్ లాటరీ పద్దతి ద్వారా భక్తులకు కేటాయిస్తారు. 
 
ఇక కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవకు సంబంధించిన టిక్కెట్లను భక్తులు నేరుగా బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. అయితే, ప్రత్యేక రోజుల్లో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. 
 
ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు రెండు రజుల పాటు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు విడుదల చేస్తారు. టిక్కెట్లు పొందిన వారి జాబితాను ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటల తర్వాత తితిదే వెబ్‌సైట్‌లో వెల్లడిస్తుంది. 
 
అదేవిధంగా భక్తులకు ఎస్ఎంఎస్ ద్వారా, మెయిల్ ద్వారా సమాచారం చేరవేస్తుంది. టిక్కెట్లు పొందిన భక్తులు రెండు రోజుల్లో సేవల చార్జీలకు సంబంధించిన రుసుంను చెల్లించాల్సి ఉంటుంది.