ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (15:51 IST)

వివాహేతర సంబంధానికి అడ్డు.. కన్నబిడ్డలకు పాయసంలో విషం ఇచ్చి..?

upma
upma
వివాహేతర సంబంధాల కారణంగా నేరాల సంఖ్య పెరిగిపోతున్నాయి. తాజాగా వివాహేతర సంబంధానికి అడ్డుగా వున్నారని ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో కన్యాకుమారి జిల్లా మార్తాండంలో చోటుచేసుకుంది. 
 
ఈ ఘటనలో ఆమె కుమారుడు మరణించాడు. కుమార్తె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వివరాల్లోకి వెళితే.. మార్తాండంలో జగదీశ్, కార్తీక దంపతులు. వారికి కూతురు సంజన(3) కుమారుడు చరణ్‌(1) ఉన్నారు.
 
అయితే కార్తీక.. సునీల్ అనే వ్యక్తితో వివాహేతరం సంబంధం పెట్టుకుంది. ఇందుకు తన ఇద్దరు పిల్లలు అందుకు అడ్డు వస్తున్నారని భావించింది. అంతే పిల్లలకు విషం కలిపిన సేమ్యా ఉప్మాను ఇచ్చింది.
 
దాంతో ఇద్దరు పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. అనంతరం ఆమె తన భర్తకు ఫోన్ చేసి పిల్లలు పొరపాటున ఎలుకల మందు తాగారని చెప్పింది. 
 
అనంతరం వారిని ఆస్పత్రికి తరలించారు. కార్తీక కుమారుడు పరిస్థితి విషమించి మృతి చెందగా కుమార్తె చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కార్తీక అరెస్ట్ చేశారు.