సోమవారం, 9 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (19:37 IST)

అలీ కూతురు గుడ్ న్యూస్ చెప్పింది.. ఏంటదో తెలుసా? (video)

Ali
Ali
హాస్యనటుడు అలీ కూతురు ఫాతిమా గురించి ఓ గుడ్ న్యూస్‌ను షేర్ చేసుకున్నారు. ఫాతిమా డాక్టర్ అయ్యిందట. ఇది అలీ కోరిక అని.. తన కూతురి ద్వారా అలీ కోరిక తీరినట్టు హర్షం వ్యక్తం చేశారు. అలాగే అలీకి  ముగ్గురు పిల్లలు. ఇద్దరు ఆడపిల్లలు కాగా ఇంకొకరు అబ్బాయి కావడం విశేషం.
 
వాళ్ళ పేర్లు ఫాతిమా రమీజున్, మహమ్మద్ బాషా, జుబేరియా. అలీ మంచి ఫ్యామిలీ మెన్. ఏమాత్రం సమయం దొరికినా తన భార్యా పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయడానికి చూస్తుంటారు.
 
ఇకపోతే.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను మొదలుపెట్టిన అలీ అనతి కాలంలోనే పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూనే మరోపక్క టీవీ వ్యాఖ్యాతగా బుల్లితెర పై కూడా సందడి చేస్తున్నాడు. 'సీతాకోకచిలుక' చిత్రం ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అలీ 1100కి పైగా సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.
 
తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా ఆయన నటించారు. అకాడమీ ఆఫ్ యూనివర్సల్ పీస్ వారు ఆలీకి గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.