1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Telangana Inter Board Good News to Inter Students

పావు గంట ఆలస్యమైనా ప్రాక్టికల్స్‌కు అనుమతి

Telangana Inter Board
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఆ రాష్ట్ర విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నిర్ణీత సమయానికి పావు గంట ఆలస్యమైన ప్రాక్టికల్స్ పరీక్షా హాలుకు అనుమతిస్తామని తెలిపింది. 
 
ఈ నెల 23వ తేదీ నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ల్యాబ్‌కు 15 నిమిషాలు ఆలస్యమైన అనుమతిస్తామని తెలిపింది. ఆ తర్వాత మాత్రం అనుమతించవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. 
 
కాగా, విద్యార్థులు వారు చదువుకుంటున్న కాలేజీల్లోనే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తారు. జాగ్రఫీ విద్యార్థులకు మాత్రం ఈ నెల 31వ తేదీ నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు ప్రాక్టిల్స్ నిర్వహించేలా ఏర్పాట్టు చేశారు. 
 
అలాగే, ఎగ్జామినర్లుగా నియమితులైన అధ్యాపక సిబ్బందిని కూడా విధుల నుంచి రిలీవ్ చేయాలని, లేదంటే రూ.5 వేల అపరాధం విధిస్తామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది. అలాగే, విద్యార్థులకు ఎగ్జామినర్లు వేసిన మార్కులను అదే రోజు రాత్రి 8 గంటల లోపు ఆన్‌లైన్‌లో బోర్డుకు పంపించాన్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
వన్ మ్యాన్ షో కట్టడికి సీనియర్ల యత్నాలు... మర్రి శిశిధర్ రెడ్డి నివాసంలో భేటీ