గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 మార్చి 2022 (10:59 IST)

ప్రభుత్వ ఉద్యోగాలకు నిరుద్యోగుల గరిష్ట వయో పరిమితి పెంపు

ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నిరుద్యోగుల గరిష్ట వయో పరిమితిని పొడగిస్తూ జీవో జారీచేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పేరిట ఈ జీవో జారీ అయింది. 
 
ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే నిరుద్యోగుల గరిష్ట వయోపరిమితి ప్రస్తుతం 34 సంవత్సరాలుగా ఉంది. దీన్ని 41 యేళ్లకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో నంబరు 42ను జారీచేసింది. ఈ సడలింపు నిర్ణయం వచ్చే రెండేళ్ల పాటు అంటే 2024 మార్చి 18వ తేదీ వరకు ఉంటుంది. 
 
అయితే, ఈ మినహాయింపు పోలీస్, ఎక్సైజ్, జైళ్ళ, అటవీశాఖ వంటి యూనిఫాం సర్వీసులకు వర్తించదు. కాగా, 80039 ఉద్యోగ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. దీంతో వయోపరిమితి దాటిన వారికి కూడా లబ్ది చేకూరేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.