గురువారం, 30 నవంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 మార్చి 2022 (15:46 IST)

ఆర్ఆర్ఆర్ టీమ్‌కు గుడ్ న్యూస్.. టికెట్ల రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ ప్రభుత్వం ఆర్ఆర్ఆర్ టీమ్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీ కోసం టికెట్ల రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ విడుదలైన మొదటి 10 రోజుల పాటు ప్రత్యేక టిక్కెట్ ధరలను నిర్ణయించడానికి అంగీకరించింది. 
 
అంతేకాదు తొలి పది రోజుల పాటు ఉదయం 7 గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకు ఐదు షోలను ప్రదర్శించేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జీవో జారీ చేసిన రెండు రోజుల తర్వాత తెలంగాణలో ఆర్ఆర్ఆర్‌కి అనుమతించిన అదనపు రేట్లు వర్తిస్తాయి. జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని థియేటర్లకు అడ్మిషన్ రేట్లకు మించి టిక్కెట్టుకు రూ. 75 పెంచడానికి అనుమతించింది. 
 
కొత్త జీవోతో థియేటర్ యజమానులు ప్రస్తుత టిక్కెట్ ధరలకు అదనంగా టిక్కెట్లను విక్రయించవచ్చు. అలాగే నగరాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మూవీ విడుదలైన తేదీ నుండి 10 రోజుల పాటు టిక్కెట్లను రూ. 236, మల్టీప్లెక్స్‌లలో రూ. 265కి విక్రయించవచ్చు.