1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 ఏప్రియల్ 2022 (15:02 IST)

ఎస్వీబీసీ ఛానల్‌లో సినిమా పాటలా?

Somu veeraju
ఎస్వీబీసీ ఛానల్‌లో సినిమా పాటలు ప్రసారమవుతున్నాయనే వివాదంపై బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు మండిప‌డ్డారు. ఛానల్‌ నిర్వహణ బాధ్య‌త‌లు రాజకీయ నాయకుల చేతుల్లో ఉండ‌డం ఎందుకు అని ఆయ‌న నిల‌దీశారు.  
 
ధర్మ ప్రచారానికి టీటీడీ బడ్జెట్‌లో ఎంత కేటాయిస్తున్నారో చెప్పాల‌ని, ధర్మ ప్రచార కార్యక్రమాలు పూర్తిగా ఆగిపోయాయని సోము వీర్రాజు అన్నారు. టీటీడీ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత బోర్డ్‌ది మాత్ర‌మే కాదని, ఆ బాధ్య‌త‌ ప్రభుత్వానికి కూడా ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.  
 
తిరుమ‌ల‌లో భక్తులకు వసతులు కల్పించాల్సిన బాధ్యత టీటీడీదేన‌ని, భక్తులు ఇటీవలి కాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా టీటీడీ వేదపాఠశాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.