వైఎస్సార్సీపీకి షాక్: తెలుగుదేశం పార్టీలోకి బైరెడ్డి సిద్దార్థరెడ్డి ?
వైఎస్సార్సీపీకి షాక్ తప్పేలా లేదు. సోషల్ మీడియా స్టార్, వైఎస్ఆర్ పార్టీ యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఏపీ శ్యాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి తెలుగుదేశం పార్టీ గూటికి చేరుతున్నారని ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా ఆయన.. ఏపీ సీఎం జగన్‌కు హార్డ్ కోర్ అనుచరునిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి పార్టీ మారుతున్నారనే వార్త ప్రస్తుతం వైకాపా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
తెలుగుదేశం పార్టీకి 2018 వరకు సిద్ధార్థరెడ్డి పరోక్షంగా సేవలు అందించారు. కానీ 2019 ఎన్నికలకు ముందు సిద్ధార్థ రెడ్డి వైకాపాలో చేరారు. నందికొట్కూర్ నియోజకవర్గం ఇంచార్జిగా కూడా పనిచేశారు. పార్టీని బలోపేతం ఎన్నికల నాటికి బలోపేతం చేశారు. తనకు కచ్చితంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇస్తారని ఆశించారు. కానీ సామాజిక ఈక్వేషన్లు, స్థానికంగా ఉండే రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఆయనకు జగన్ టిక్కెట్ ఇవ్వలేకపోయారు.
ఆర్థర్‌కు వైసీపీ టిక్కెట్ దక్కింది. అయితే అధినేత జగన్‌పై నమ్మకంతో.. ఆర్ధర్‌ను గెలిపించే బాధ్యతలను సిద్ధార్థరెడ్డి తీసుకున్నారు. అందులో సక్సెస్ అయ్యారు. ఆర్థర్‌ను గెలిపించారు కూడా. కానీ పార్టీ అంతర్గత పోరుతో కాస్త ఇబ్బందులు తప్పలేదు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం సిద్ధార్థరెడ్డికి క్యాబినెట్ ర్యాంకు ఉన్నశాప్ చైర్మన్ పదవిని జగన్ ఇచ్చారు.
అయినా రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, సిద్ధార్థ రెడ్డి రహస్యంగా భేటీ అయ్యారని నందికొట్కూర్ కేంద్రంగా వార్తలు గుప్పుమంటున్నాయి.
దీంతో త్వరలో సిద్ధార్థరెడ్డి టీడీపీ గూటికి చేరతారని బలమైన ప్రచారం జరుగుతోంది. ఏపీ సీఎం జగన్‌కు వీరవిధేయునిగా ఉన్న సిద్ధార్థరెడ్డి పార్టీ మారే అవకాశం లేదని టాక్.