1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 ఏప్రియల్ 2022 (12:04 IST)

జయమ్మ పంచాయతీపై టీడీపీ ఎంపీ ఏమన్నారు..?

Jayamma- Suma
అలాంటి టాలీవుడ్ ప్రముఖ యాంకర్ సుమ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా 'జయమ్మ పంచాయితీ'   ఈ సినిమాను వచ్చేనెలలో విడుదల చేసేందుకు రంగం సిద్ధం అయ్యింది. ఈ సందర్భంగా జయమ్మ టీం... ప్రమోషన్లలో బిజీగా మారింది. ఇప్పటికే జయమ్మ పంచాయతీ సినిమా ట్రైలర్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదల చేశారు. 
 
తాజాగా జయమ్మ పంచాయతీ సినిమాపై టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు పలు వ్యాఖ్యాలు చేశారు. ఈ సినిమా ట్రైలర్‌ బాగుందని సోషల్‌ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. ''శ్రీకాకుళం యాసతో సినిమాలు రూపొందించడాన్ని చూసి తాను గర్వపడుతున్నట్లు చెప్పారు. 
 
ట్రైలర్‌ను బట్టి చూస్తే.. ఈ సినిమా పల్లెటూరులో జరిగిన ఓ ఘటన ఆధారంగా తెరకెక్కినట్లు తెలుస్తోంది. విజయ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఉత్తరాంధ్రలోని ఓ పల్లెటూరి వాతావరణం కనిపించనుంది. చాలాకాలం తర్వాత సుమ వెండితెరపై ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. 
 
బలగ ప్రకాశ్‌ నిర్మించిన ఈ చిత్రంలో దేవీ ప్రసాద్‌ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకి సంగీతం: ఎం.ఎం. కీరవాణి, కూర్పు: రవితేజ గిరిజాల, ఛాయాగ్రహణం: అనూష్‌ కుమార్‌. ఈ చిత్రం మే 6న ప్రేక్షకుల ముందుకురానుంది.