బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 14 డిశెంబరు 2021 (16:22 IST)

ఢిల్లీలో బీసీ సంఘాల నిర‌స‌న‌.... జ‌త క‌లిసిన వైసీపీ, టీడీపీ ఎంపీలు

2021 జనాభా లెక్కల సేకరణలో ప్రత్యేక ఓబిసి కాలమ్ ద్వారా బిసి కుల జనగణన జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని దేశంలోని ప్ర‌తిప‌క్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఢిల్లీలో బిసి సంఘాల స‌మాఖ్య ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నా చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర మ‌రి కొన్ని రాష్ట్రాల బిసి సంఘాల పోరాటానికి మద్దతిస్తూ, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మూడు రోజులపాటు చేపట్టిన ధర్నాలో పాల్గొన్న ప‌లువురు పార్లమెంట్ సభ్యులు పాల్గొన్నారు.


వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, పిల్లి సుభాష్ చంద్ర‌బోస్, త‌దిత‌రులు ఈ ధ‌ర్నాలో పాలు పంచుకున్నారు. వీరితోపాటు టీడీపీ ఎంపీలు కేశినేని శ్రీనివాస్ (నాని), గల్లా జయదేవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు. 

 
రాజ్యాంగం ప్ర‌కారం ఎస్సీ, ఎస్టీ జ‌నాభా లెక్క‌లు తీయాల‌నేది చ‌ట్ట‌ప్ర‌కారం దేశవ్యాప్తంగా జ‌రుగుతోంది. అయితే, ఇత‌ర ఓబీసీలు కింద ఉన్న‌ 93 కులాల జ‌న‌గ‌ణ‌న చేయాల‌ని ఎప్ప‌టి నుంచో డిమాండు చేస్తున్నారు. ఇటీవ‌ల పెరిగిపోతున్న ఈ డిమాండు, ఇప్ప‌ట్లో సాధ్యం కాద‌ని ప్ర‌ధాని మోదీ స్ప‌ష్టం చేశారు. ఓబిసి పార్ల‌మెంట‌రీ పార్టీ చేసిన సిఫార‌సును ప్ర‌ధాని తోసిపుచ్చారు. జ‌స్టిస్ రోహిణి క‌మిష‌న్ కూడా దీనిపై సానుకూలంగా స్పందించి, బీసీ జ‌న‌గ‌ణ‌న చేయాల‌ని సిఫార‌సు చేసింది. కానీ, ఇపుడున్న జ‌న గ‌ణ‌న వ్య‌వ‌స్థ‌తో ఓబీసీ జ‌న గ‌ణ‌న చేయాల‌ని డిమాండు చేస్తున్నారు.