మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 డిశెంబరు 2021 (17:50 IST)

ఏపీలో తక్షణ రాష్ట్రపతి పాలన విధించండి : వైకాపా రెబెల్ ఎంపీ డిమాండ్

వైకాపా పార్టీ అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తక్షణం రాష్ట్రపత పాలన విధించాలని ఆ పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం లోక్‌సభలో కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
 
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా, ఆయన సోమవారం 377 నిబంధన కింద లోక్‌సభలో లిఖితపూర్వకంగా నివేదించారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి అస్త వ్యస్తంగా మారిందని ఆయన ఆరోపించారు. 
 
అప్పుల కోసం ప్రభుత్వం ఆస్తులను తాకట్టు పెడుతుందన్నారు. నిజానికి ఏపీలో ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని, చివరకు ప్రభుత్వ ఉద్యోగులకు  సైతం వేతనాలు చెల్లించలేని పరిస్థితి నెలకొందన్నారు. 
 
కార్పొరేషన్ల పేరుతో దొడ్డిదారిన రుణాలు తీసుకుంటున్నారని గుర్తుచేశారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందని, అందువల్ల తక్షణం రాష్ట్రపతి పాలన విధించి పరిస్థితులను చక్కదిద్దాలని ఆయన కోరారు.