శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 డిశెంబరు 2021 (12:58 IST)

వచ్చే 48 గంటల్లో ఏపీలో తేలికపాటి వర్షాలు : ఐఎండీ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే 48 గంటల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అదేవిధంగా రానున్న ఐదు రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్, కేరళ, కాశ్మీర్, లఢక్, అండమాన్ అండ్ నికోబార్ తదితర ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 
 
ఇకపోతే, దేశంలోని అనేక ప్రాంతాల్లో వచ్చే మూడు, నాలుగు రోజుల పాటు పగటి, రాత్రిపూట ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోవని తెలిపింది. మిజోరం, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, అస్సాం రాష్ట్రాల్లో రానున్న 48 గంటల పాటు ఉదయం వేళల్లో మాత్రం దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.