ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 ఏప్రియల్ 2022 (15:50 IST)

"ఆచార్య" ప్రిరిలీజ్ వేదికను మార్చారు...

acharya
మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రాంచరణ్ కలిసి నటించిన ఆచార్య చిత్రం ఈ నెల 29వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఇది చిరంజీవి 152వ చిత్రం. కొరటాల శివ దర్శకత్వం వహించారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ నటించారు. 
 
దేవాలయ భూములు కుంభకోణం నేపథ్యంలో సాగే సందేశాత్మక చిత్రం. ఇందులో చెర్రీ సిద్ధ అనే పాత్రను పోషించారు. చెర్రీకి జోడీగా పూజా హెగ్డే నటించారు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదలై మంచి టాక్‌ను తెచ్చుకుంది. 
 
ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీన ప్రిరిలీజ్ ఈవెంట్‌ను విజయవాడ వేదికగా మార్చాలని భావించారు. కానీ, చిత్రం యూనిట్ తన నిర్ణయాన్ని మార్చుకుంది. హైదరాబాద్ నగరంలో ఈ వేడుకను నిర్వహించాలని నిర్ణయించింది. 
 
నిజానికి విజయవాడలో జరిగే వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొంటారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ వేడుక హైదరాబాద్‌కు మారింది కాబట్టి ముఖ్య అతిథి ఎవరు అనేది తెలియాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల వాళ్ళ ఈ వేడుకను విజయవాడ నుంచి హైదరాబాద్‌కు మార్చినట్లు తెలుస్తోంది.