శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 ఏప్రియల్ 2022 (14:54 IST)

గెటప్ శ్రీను రెండో పెళ్లి చేసుకున్నాడా? ఆ యువతి ఎవరు?

seenu
seenu
జబర్దస్త్ షో లో గెటప్ శ్రీను వేసే పాత్రలు, చేసే నటన అందరినీ కట్టిపడేస్తుంది. ప్రస్తుతం గెటప్ శీను రెండో పెళ్లి చేసుకున్నాడా అనే విధంగా ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
తాజాగా పెళ్లి పీటలపై కూర్చున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు గెటప్ శీను. ప్రస్తుతం గెటప్ శ్రీను రాజు యాదవ్ అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో గెటప్ శ్రీనునె హీరో. ఈ సినిమా కోసం గెటర్ శీను.. పెళ్లి కొడుకుగా కనిపిస్తున్నాడా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 
 
అలాగే మెగాస్టార్ నటించిన ఆచార్య లాంటి భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నాడు. దాదాపు ఇప్పుడు అర్జెంట్ సినిమాలో గెటప్ శ్రీను ఫుల్ స్పీడ్‌లో ఉన్నారు. 
 
ఈ సినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్ షూటింగ్ జరిగింది. అయితే చివరి షెడ్యూల్ లో గెటప్ శ్రీను పెళ్ళికొడుకు గెటప్‌లో కనిపించాడు. వాటికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 
 
అయితే ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు గెటప్ శ్రీను రెండో పెళ్లి చేసుకున్నాడా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.