మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 మార్చి 2022 (13:56 IST)

రేణు దేశాయ్ రెండో పెళ్లి ఏమైంది?

"బద్రి" సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రేణు దేశాయ్, ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌తో ప్రేమలో పడటం, పవన్ కళ్యాణ్‌తో 2009లో పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. 
 
పవన్ - రేణుదేశాయ్‌లకు అకిరానందన్, ఆద్యలు అనే ఇద్దరు పిల్లలు వున్నారు. అయితే, ఆ తర్వాత ఇద్దరి మధ్యా అభిప్రాయ బేధాలు తలెత్తి విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత రేణు దేశాయ్ రెండో పెళ్లికి సిద్ధమైంది.  
 
దాంతో, పవన్ అభిమానుల పేరుతో కొందరు రేణు దేశాయ్‌ని ట్రోలింగ్ చేశారు. ఆ తర్వాత పెళ్ళి గురించి రేణు దేశాయ్ పెద్దగా ఎక్కడా మాట్లాడలేదు. పవన్ అభిమానుల పేరుతో గలాటా కూడా తగ్గింది. దీంతో ఆమె రెండో పెళ్లి ఆగిపోయిందని టాక్ వస్తోంది. 
 
ఇకపోతే... సినిమాల్లో రీ-ఎంట్రీ ఇచ్చేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారుగానీ, సరైన ఛాన్సులైతే ఆమెకు రావడం లేదు.  ప్రస్తుతం బుల్లితెర షోలకు ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్నారు.