మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 జనవరి 2022 (14:36 IST)

ఎంతో జాగ్రత్తగా ఉన్నప్పటికీ కరోనా కాటేసింది... రేణూ దేశాయ్

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. ఈ వైరస్ కోరల్లో అనేక మంది సెలెబ్రిటీలు చిక్కుకుంటున్నారు. ఇపుడు సినీ నటుడు ,వర్ స్టార పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్, పవన్ కుమారుడు అఖిరాలు ఈ వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని రేణూ దేశాయ్ స్వయంగా వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆమె ఓ ట్వీట్ చేశారు. 'హలో... ఎక్కువగా ఇంట్లోనే ఉన్నప్పటికీ నాకు అఖీరాకు ఇటీవల కరోనా వైరస్ సోకింది. మేమిద్దరం ఇపుడు కోలుకుంటున్నాం. మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను.. కోవిడ్ థర్డ్ వేవ్‌ను సీరియస్‌గా తీసుకోండి. ముఖానికి మాస్కులు ధరించండి. వీలైనంత మేరకు భౌతిక దూరం పాటిస్తూ స్వీయ జాగ్రత్తలు తీసుకోండి. నేను రెండు డోసుల కరోనా టీకా వేసుకోగా, అఖీరా మాత్రం ఒక్క డోస్ కోవిడ్ టీకా వేసుకున్నారు అని ఆమె పేర్కొన్నారు.