సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 జనవరి 2022 (23:18 IST)

మాస్ మహారాజతో పవన్ మాజీ భార్య.. ఏ సినిమాలో తెలుసా? (video)

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ సతీమణి, నటి రేణు దేశాయ్ మాస్ మహారాజ రవితేజతో కలిసి నటించనుందనే వార్త ప్రస్తుతం ఫిలిమ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే సెకండ్ ఇన్నింగ్స్ బుల్లితెరపై జడ్జ్‌గా మొదలుపెట్టిన ఆమె ఇప్పుడు వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 
 
తాజాగా మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వరావు’ బయోపిక్‌లో రేణు ఒక కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 
 
ఈ బయోపిక్‌లో రవితేజ సోదరి పాత్రలో రేణు కనిపించనుందని సమాచారం. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది రవితేజ కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
 
అందుకు తగ్గట్టుగానే క్యాస్టింగ్‌ని కూడా సెలెక్ట్ చేస్తున్నట్లు అర్ధమవుతుంది. దీనికోసమే రేణును సంప్రదించారని టాక్ వస్తోంది. ఇందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఆమె రెండో ఇన్నింగ్స్ కూడా మెరుగ్గా వుంటుందని సినీ పండితులు చెప్తున్నారు.