గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (13:42 IST)

అత్తారింటిలో వరకట్నం వేధింపులు.. పుట్టింటికి భార్య.. భర్త రెండో పెళ్లి?

అత్తారింటిలో వరకట్నం వేధింపులు. పెళ్లైన వెంటనే ఈ వేధింపులు ఎదురు కావడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో భర్త రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. కానీ రెండో పెళ్లి చేసుకోబోతున్న భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ ఘటన నల్గొండలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. నల్గొండ కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు, భువనగిరికి చెందిన మధుబాబుకు హైదరాబాద్ బోడుప్పల్‌కు చెందిన సరితతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన వెంటనే సరితకు అత్తింటి నుంచి వరకట్న వేధింపులు ఎదురయ్యాయి. దీంతో పుట్టింటికి వెళ్లింది. 
 
భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మధుబాబు మళ్లీ పెళ్లి చేసుకునేందుకు యత్నించగా సరిత రెండుసార్లు అడ్డుకుంది. అయినప్పటికీ పెళ్లి ప్రయత్నాలు ఆపలేదు మధుబాబు. ఈసారి కోదాడ సమీపంలోని గ్రామానికి చెందిన యువతితో పెళ్లి ఖాయం చేసుకున్నాడు. ఆదివారం ఈ పెళ్లిని అతని భార్య అడ్డుకుంది.  
 
ఈ సందర్భంగా మధుబాబుకు గతంలోనే వివాహం జరిగిన విషయాన్ని వధువు కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు కూడా మధుబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.