సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (17:56 IST)

ఆచార్య ఫైట్‌కు ఫ్యాన్స్ ఫిదా

Chiru- Ramcharan
Chiru- Ramcharan
మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న `ఆచార్య‌` చిత్ర ట్రైల‌ర్ ఇటీవ‌లే విడుద‌లైంది. ఇందులో యాక్ష‌న్ సీన్స్‌కు ఫ్యాన్స్ నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది. ముఖ్యంగా తండ్రీ కొడుకులు క‌లిసి న‌గ్జ‌లైట్ దుస్తుల‌తో ఫైట్ చేసే స‌న్నివేశం బాగుంద‌ని మెగాస్టార్ ఫాన్స్ అధ్య‌క్షుడు తెలియ‌జేస్తున్నాడు. ట్రైల‌ర్‌లో త‌నికెళ్ళ భ‌ర‌ణి.. సిద్దా తెలుసా! మీకు అంటూ చిరంజీవిని అడ‌గ‌డం.. వెంట‌నే.. చిరంజీవి మోకాలిపై కూర్చొని చేయి చాప‌గానే సిద్ధ పాత్ర చ‌ర‌ణ్ ఎగురుకుంటూ వ‌చ్చి చేయిపైనుంచి జంప్ చేయ‌డం సీన్ యాక్ష‌న్‌లో కొత్త‌గా వుంద‌ని తెలియ‌జేస్తున్నారు.
 
ఈ యాక్ష‌న్‌ను రామ్‌ల‌క్ష్మ‌ణ్‌, విజ‌య్ ఫైట్ మాస్ట‌ర్లు నిర్వ‌హించారు. న‌గ్జ‌ల్ నేప‌థ్యం అనేది క‌థ‌లో కొంత భాగ‌మే వుంటుంద‌ని తెలుస్తోంది. కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించిన ఈ సినిమా ఈనెల 29న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాను నిరంజన్ రెడ్డి నిర్మించారు.