శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (13:37 IST)

ఆచార్య ట్రైల‌ర్ 153 థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతుంది

Acharya trailer list
Acharya trailer list
మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న చిత్రం ఆచార్య‌. రామ్‌చ‌ర‌న్ కూడా ఇందులో న‌టించాడు. ఏప్రిల్ 29న సినిమా విడుద‌ల కాబోతోంది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారంనాడు సాయ‌తంత్రం 5గంట‌ల 49 నిముషాల‌కు ఆచార్య చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్నారు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని నిరంజ‌న్ రెడ్డి నిర్మించారు. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు ప్ర‌జాద‌ర‌ణ పొందాయి. రామ‌జోగ‌య్య శాస్త్రి రాసిన శివునిపై పాట అనూహ్య‌స్పంద‌న పొందింది. 
 
ఇక ఆచార్య సినిమా చిరంజీవికి 153వ చిత్రం. అందుకే ఈరోజు 153 థియేట‌ర్ల‌లో ట్రైల‌ర్‌ను విడుద‌ల‌చేస్తున్నారు. క‌డ‌ప‌, క‌ర్నూలు, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల‌తోపాటు శ్రీ‌కాకుః, త‌మిళ‌నాడు, క‌ర్నాట ప్రాంతాల‌లోని థియేట‌ర్ల‌లో ఒకేసారి విడుద‌ల చేయ‌డం విశేషం. సైరా త‌ర్వాత చిరంజీవి న‌టిస్తున్న చిత్రం కావ‌డంతో ఇప్ప‌టికే ఆయా థియేట‌ర్ల వ‌ద్ద మెగా అభిమానులు క‌టౌట్ల‌తో సంద‌డి చేస్తున్నారు. ఇక సాయంత్రం విడుద‌ల త‌ర్వాత ఎంత రేంజ్‌లో స్పందిస్తారో చూడాలి.