సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (12:58 IST)

రాజ‌మౌళి కాపీ క్రియేటివిటీకి హాట్సాప్

N.T.R., Ramcharan, Laurel and Hardy
N.T.R., Ramcharan, Laurel and Hardy
సినిమా అంటేనే క‌ల్పితం. మ‌న‌దికాని సినిమాను కాపీచేసి ర‌క‌ర‌కాల ప్ర‌యోగాలు చేయ‌డం ఇండియా చ‌ల‌న చిత్ర‌రంగం చేస్తున్న కొత్త ప్ర‌యోగం. సినిమా ఆరంభంనుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఒక దేశం క‌ల్చ‌ర్‌ను ప్ర‌పంచానికి తెలియ‌జేయ‌డం ఒక్క సినిమా వ‌ల్ల‌నే సాధ్య‌మ‌వుతుంది. అలా పాశ్చాత్య క‌ల్చ‌ర్ అల‌వ‌డుతూ సినిమాలు వ‌చ్చేస్తున్నాయి. ఇది ఒక భాగ‌మైతే ఒక భాష‌లో బాగా పాపుల‌ర్ అయిన న‌చ్చిన సీన్‌ల‌ను కాపీచేసి తీయ‌డం ఒక క‌ళ‌. తెలుగులో అలా ద‌ర్శ‌కుడు దాసరి నారాయ‌ణ‌రావుకు ఆ పేరు వుంది. కాపీ చేయ‌డం కూడా ఓ క‌ళ అంటూ ఓ సంద‌ర్భంలో ఆయ‌న వెల్ల‌డించారు. అప్పుడు సాంకేతిక‌త‌, సోష‌ల్ మీడియా అంత‌గా అభివృద్ధి చెంద‌లేదు. కానీ ఇప్పుడు బాగా అభివృద్ధి చెందింది . అయినా స‌రే ఇత‌ర భాష‌ల్లో సీన్లు మ‌క్కికి మ‌క్కీ కాపీ చేయ‌డంలో రాజ‌మౌళి సిద్ధ‌హ‌స్తుడు అనే పేరుంది.
 
బాహుబ‌లిలో యుద్ధ స‌న్నివేశాలు ఇందుకు ఉదాహ‌ర‌ణ‌లుకూడా చెప్పొచ్చు. అనుష్క ఎండిన పుల్ల‌లు ఏరుకోవ‌డం స‌న్నివేశం చైనా సినిమాకు కాపీనే. కానీ దాన్ని క‌థ‌కు అనుగుణంగా మ‌లిచి సింక్ చేయ‌డం విశేషం. ఇప్పుడు కూడా ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమాలో చాలా సీన్లు విదేశీ సినిమాల అనుక‌ర‌ణే. బ్రిటీష్ వారిపై ఇద్ద‌రు పోరాటం చేసే క‌థ ఇది. ఇందులో రాజ‌భ‌వ‌నంలో ఎన్‌.టి.ఆర్‌., రామ్‌చ‌ర‌ణ్‌లు నాటు నాటు పాట‌కు డాన్స్ చేసి అల‌రించారు. అది హాస్య‌న‌టులుగా పేరుపొందిన లారెల్ అండ్‌ హార్డీ 1937 కామెడీ 'వే అవుట్ వెస్ట్' (మెట్రో-గోల్డ్‌విన్-మేయర్) సినిమాలోని సీన్‌కు ఎత్తేశాడు.

ఇక ఎన్‌.టి.ఆర్‌. పులితో గాండ్రిచే స‌న్నివేశం కూడా అర్నార్డ్ స్కావెంజ‌ర్‌ న‌టించిన మ‌రో సినిమాలోనిది. ఇలా అన్ని సినిమాలు క‌లిపి తెలుగులో అంద‌రికీ ఆక‌ట్టుకునేలా తీసిన ఆర్.ఆర్‌.ఆర్‌. తెలుగులోకంటే బాలీవుడ్‌లో బాగా ఆడ‌డం విశేషంగా ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. బాలీవుడ్‌లో పెద్ద హీరోల చిత్రాలు ఏవీ విడుద‌ల కాక‌పోవ‌డం ఆర్‌.ఆర్‌.ఆర్‌.కు బాగా ప్ల‌స్ అయింద‌ని విశ్లేషిస్తున్నాయి. ఏది ఏమైనా రాజ‌మౌళి క్రియేటివిటీకి హాట్సాప్ చెప్పాల్సిందే.