శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (13:05 IST)

రియల్ ఎస్టేట్ యాడ్ చేసిన చిరంజీవి డైరెక్ట్ చేసిన సుకుమార్‌

Chiranjeevi, Sukuma
మెగాస్టార్  చిరంజీవి వ‌య‌స్సుతో సంబంధంలేకుండా యూత్ హీరోల‌కు పోటీగా వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నారు. అదేజోరులో క‌మ‌ర్షియ‌ల్ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. ఇందుకోసం ఆయ‌న్ను ద‌ర్శ‌క‌త్వం చేసింది సుకుమార్‌. ఈ సంద‌ర్భంగా చిరంజీవి త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేస్తూ ట్విట్ట‌ర్ వేదిక‌గా సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. 
 
Chiranjeevi, Sukuma
దర్శకుడుగా సుకుమార్ ప్రతిభ అందరికి తెలిసిందే. ఓ ad film కోసం, వారి దర్శకత్వంలో షూటింగ్ నేను చాలా ఈజీగా చేశాను.ఈ యాడ్ నిర్మించిన శుభగృహ రియల్ ఎస్టేట్ వారికి శుభాభినందనలు అని పేర్కొన్నారు. 
 
చిరంజీవి ఇప్ప‌టికే భోళాశంక‌ర్‌తోపాటు మూడు సినిమాలు ర‌న్నింగ్‌లో వున్నాయి. ఈనెల‌లోనే ఆచార్య సినిమా విడుద‌ల‌కాబోతుంది.