సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 ఏప్రియల్ 2022 (21:12 IST)

బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత.. ఆర్ఆర్ఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా..

rrrmovie
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మూవీ ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది.
 
భారీగా వసుళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్, శ్రియ, అలియాభట్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో మల్లి నటించింది. ఈమె చుట్టే కథ అంతా నడుస్తోంది.
 
ఆర్ఆర్ఆర్ సినిమా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌తో రాజమౌళి సృష్టించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్లను వసూలు చేసింది. ఇంత మొత్తంలో దంగల్, బాహుబలి 2 మాత్రమే వసూళ్లు చేశాయి. 
 
ఈ రికార్డుతో ఆర్‌ఆర్‌ఆర్ మూవీ మూడో చిత్రంగా నిలిచింది. అందులో రెండు చిత్రాలు రాజమౌళివే ఉండడం విశేషం. 
 
కొమరంభీం, అల్లూరి సీతారామరాజు పాత్రలను జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పోషించారు. నిర్మాత డీవీవీ దానయ్య రూ.450 కోట్లను ఈ సినిమా నిర్మాణం కోసం ఖర్చు చేశారు. మార్చి 25న ఈ సినిమా థియేటర్లలోకి రాగా 16 రోజుల్లోనే అధిక మొత్తంలో కలెక్షన్లు వసూలు చేసి రికార్డులు సృష్టిస్తోంది.