గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (16:22 IST)

"కేజీఎఫ్-2"కు తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్

KGFChapter2Teaser
కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన తాజా చిత్రం "కేజీఎఫ్ చాఫ్టర్ 2". ఈ చిత్రం ఈ నెల 14వ తేదీన ప్రచంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలకానుంది. భారీ బడ్జెట్‌తో తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో నిర్మించారు. భారీ తారణం నటించారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. 
 
"కేజీఎఫ్" తొలి భాగం సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో ఇపుడు "కేజీఎఫ్-2"పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా యష్ మారిపోయారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం టిక్కెట్ రేట్లను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సమ్మతించింది. 
 
ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం జీవో జారీ చేసింది. మల్టీప్లెక్స్‌లో 30 రూపాయలు చొప్పున టిక్కెట్ పెంచుకునే వెసులుబాటును కల్పించింది. ఈ సినిమా విడుదల తేదీ నుంచి నాలుగు రోజుల పాటు ఈ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది.