దేశంలో స్థిరంగా పెట్రోల్ - డీజిల్ ధరలు
దేశంలో వాహనదారులను బెంబేలెత్తిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. ఈ ధరల్లో పెరుగుదల చివరిసారిగా ఈ నెల 6వ తేదీన పెరిగాయి. ఆ తర్వాత నుంచి ధరల్లో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. మంగళవారం కూడా ప్రభుత్వం రంగ చమురు కంపెనీలు ఈ చమురు ధరల జోలికి వెళ్లలేదు. దీంతో ధరల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు.
ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.105.41గా ఉంటే, లీటర్ డీజిల్ ధర రూ.96.67గా వుంది. అలాగే, హైదరాబాద్ నగరంలో లీటరు పెట్రోల్ ధర రూ.119.49గాను, డీజిల్ ధర రూ.105.49గా ఉంది. విశాఖపట్టణంలో లీటరు పెట్రోల్ రూ.120, డీజిల్ ధర రూ.103.26గా వుంది. గుంటూరులో రూ.121.60గాను, రూ.104.70గా ఉంది.