బీస్ట్ షార్ట్ రివ్యూ.. విజయ్ యాక్టింగ్ అదుర్స్..
'డాక్టర్' ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్.. 'బీస్ట్' సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మాతగా ఉన్నారు. ఈ చిత్రంలో విజయ్ దళపతి సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.
యాక్షన్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందన్ మ్యూజిక్ అందించారు. 'డాక్టర్' మూవీలో ప్రత్యేకంగా అలరించిన కమెడియన్స్ ఈ చిత్రంలోనూ నటించారు.
ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భారీ అంచనాల నడుమ ఈ చిత్రం గురువారం (ఏప్రిల్ 13)న థియేటర్లలో విడుదలైంది.
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్ర ట్రైలర్‌కు ఇప్పటికే విశేషాదరణ దక్కింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలు ఓవర్సీస్‌లో పూర్తయ్యాయి.
ఈ సినిమా రివ్యూ ఎలా వుందంటే.. 'బీస్ట్' మూవీపై సోషల్ మీడియాలో ఎక్కువ శాతం పాజిటివ్ టాక్ వస్తుంది. అయితే మరికొంతమంది ఆకట్టుకునే విధంగా స్టోరీ లేదని అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఈ మూవీ పట్ల మిశ్రమ స్పందన వస్తుందని తెలుస్తోంది.
కానీ తెరపై విజయ్ నటన, స్టైల్ అదిరింది. అదే విధంగా యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయని టాక్ వస్తోంది. అలాగే కోలీవుడ్‌లో విజయ్ సినిమా బీస్ట్‌కు విశేష స్పందన వస్తోంది.
సినిమా హాళ్ల ముందు సందడి చేస్తూ.. బాణాసంచా కాలుస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు ఫ్యాన్స్. అదిరిపోయే ఫైట్ తో హీరో విజయ్ ఎంట్రీ ఉంటుందని అభిమానులు చెబుతున్నారు.
విజయ్ నటనతో పాటు సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలైట్ అని ఫ్యాన్స్ వెల్లడించారు. అయితే సినిమా ఫస్టాఫ్ చాలా బాగుందని.. సెకండ్ ఆఫ్ ఫర్వాలేదనిపించిందని చెప్పుకొచ్చారు.