గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (18:45 IST)

బీస్ట్ తెలుగు ట్రైలర్: విజయ్ కేక పుట్టించాడు.. (video)

Beast
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తాజా సినిమా బీస్ట్ (తెలుగు) నుంచి ట్రైలర్ విడుదలైంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 13న రిలీజ్ కానుంది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు.
 
ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ గా విడుదల కానున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే తమిళ్, హిందీ భాషలలో విడుదల అయిన ట్రైలర్‌కి భారీ రెస్పాన్స్ వస్తోంది. 
 
పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బీస్ట్ ట్రైలర్ చూస్తుంటే.. మాస్ అండ్ యాక్షన్ అంశాలతో వావ్ అనిపించింది. విజయ్‌ ఇండియన్‌ స్పై వీర రాఘవ అనే ఏజెంట్‌గా కనిపించి కేక పెట్టించారు.
 
ఈ సినిమా తెలుగు రైట్స్‌ను దిల్ రాజు దక్కించుకున్నారు. ఇక బీస్ట్ ఏప్రిల్ 13న విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో.. బాక్సాఫీస్ దగ్గర కెజిఎఫ్‌తో పోటీ పడాల్సి వస్తుంది.