శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (09:32 IST)

Arabic Kuthu challenge: కుమ్మేసిన పూజా హెగ్డే (video)

కోలీవుడ్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నటించిన బీస్ట్ నుంచి అరబిక్ కుత్తు సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది ప్రముఖులు, ప్రేక్షకులు ఈ సాంగ్ స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా పూజా హెగ్డే కూడా ఈ ట్రెండ్‌లో చేరింది. ప్రస్తుతం మాల్దీవుల్లో వున్న పూజా హెగ్డే అదిరిపోయే స్టెప్పులతో అరబిక్ కుత్తుకు డ్యాన్స్ చేసింది. అదిరిపోయే స్టెప్పులతో పాటు ఆమె లుక్ కూడా అద్భుతంగా ఉండడంతో అభిమానులు ఈ వీడియోపై లైకుల వర్షం కురిపిస్తున్నారు.
 
ఇక పూజా హెగ్డే దాదాపు దశాబ్దం తర్వాత పూజా హెగ్డే తమిళ చిత్రసీమలోకి తిరిగి అడుగు పెట్టబోతోంది. ఈ నటి చివరిగా 2012లో మిస్కిన్ ‘ముగమూడి’ అనే తమిళ చిత్రం చేసింది. ఇక బ్లాక్ కామెడీ ‘బీస్ట్’కు దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్. 
 
 ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందించారు. “అరబిక్ కుతు” సాంగ్ విషయానికొస్తే… అనిరుధ్ రవిచందర్ స్వరపరిచారు. ఈ పాటను అనిరుధ్ రవిచందర్, జోనితా గాంధీ పాడారు. శివకార్తికేయన్ సాహిత్యం అందించారు. "అరబిక్ కుతు" అనేది అరబిక్ సంగీతం,తమిళ కుతు బీట్‌ల కలయికతో ఈ పాట తెరకెక్కింది.