శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (15:12 IST)

ఇంత మంచి అబ్బాయికి ఇంకా పెళ్ళెందుకు కాలేదు? "రాధేశ్యామ్" గ్లింప్స్ రిలీజ్

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ - పూజా హెగ్డే కాంబినేషన్‌లో రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ప్రేమ దృశ్య కావ్యం "రాధేశ్యామ్". వచ్చే నెల 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో విడుదలకానుంది. అయితే, ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ చిత్రానికి సంబంధించి గ్లింప్స్‌ను చిత్ర బృందం సోమవారం రిలీజ్ చేసింది. 
 
"మళ్లీ లైఫ్‌లో వాడి మొహం చూడను" అని పూజా వాయిస్‌తో మొదలైన ఈ వీడియోలో పూజకు ముద్దు పెట్టేందుకు ప్రభాస్ పడిన కష్టాలను వినోదాత్మకంగా చూపించారు. ఇక ఆఖరులో పూజ చేత ప్రభాస్ పెళ్లి ఎందుకు కాలేదు అని అడిగించేశారు. 
 
'కుక్ చేస్తావ్... బాగా మాట్లాడుతావ్... ఇంత మంచి అబ్బాయికి ఇంకా పెళ్ళెందుకు కాలేదు?' అని అడిగేసరికి ప్రభాస్ ఏం చెప్పాలో తెలియని అయోమయస్థితిలో ఉన్న ఫేస్ ఆకట్టుకునేలా వుంది. ప్రస్తుతం ఈ గ్లింప్స్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.