శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (08:37 IST)

నేడు ప్రేమికుల దినోత్సవం : మధ్యాహ్నం స్పెషల్ గ్లింప్స్‌ రిలీజ్

ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవాన్ని ప్రేమికులు జరుపుకుంటారు. అయితే, ఈ వేలంటైన్స్ డే ను పురస్కరించుకుని హీరో ప్రభాస్ నటించిన కొత్త చిత్రం "రాధేశ్యామ్" నుంచి స్పెషల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేయనున్నారు. సోమవారం మధ్యాహ్నం 1.43 గంటలకు ఈ గ్లింప్స్‌ను రిలీజ్ చేస్తామని రాధేశ్యామ్ చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. 
 
ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కించిన ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ చేసిన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న విషయం తెల్సిందే. తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా సోమవారం మధ్యాహ్నం 1.43 గంటలకు స్పెషల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేయనున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. 
 
ఈ విషయాన్ని తెలుపుతూ ఆదివారమే ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చశారు. ఈ పోస్టర్‌లో హీరోయిన్ పూజా హెగ్డే రంగులు చల్లుతూ కనిపించగా, ప్రభాస్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆలోచిస్తున్నట్టు చూపించారు. పోస్టర్‌ని అంతా రంగులు, పూలతో నింపేశారు.