గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 ఫిబ్రవరి 2022 (22:38 IST)

వెండితెరపై అద్భుతాలు సృష్టిస్తోన్న తెలుగు సినిమా: ప్రధాని మోదీ (video)

modi
తెలుగు సినిమాపై దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. 216 అడుగుల శ్రీరామానుజ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ అనంతరం ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలుగు సినిమా వెండితెరపై అద్భుతాలు సృష్టిస్తోందన్నారు. 
 
తెలుగు చిత్ర సీమ ప్రపంచ ఖ్యాతి గడించిందని మోదీ ప్రశంసించారు. వెండితెర నుంచి ఓటీటీ వరకు తెలుగు సినిమాపైనే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుందనే విషయాన్ని గుర్తు చేశారు. అంతేగాకుండా తెలుగు భాష ఔన్నత్యంపై కూడా మోదీ తన ప్రసంగంలో వ్యాఖ్యానించారు. 
 
తెలుగు భాష చరిత్ర ఎంతో సుసంపన్నమైంది. కాకతీయుల రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడం గర్వకారణం. పోచంపల్లి చేనేత వస్త్రాలు ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడించాయని ప్రశంసించారు. ప్రస్తుతం మోదీ తెలుగు సినిమాలు, తెలుగు భాషపై చేసిన వ్యాఖ్యలు వీడియో రూపంలో నెట్టింట చక్కర్లు కొడుతోంది.