సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (14:38 IST)

ఫ్యామిలీతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న పూజాహెగ్డే

టాప్ హీరోయిన్‌గా అదరగొడుతున్న పూజా హెగ్డే ఓ వైపు సినిమాలతో బిజీగా వుంటూనే మరోవైపు టూర్ ట్రిప్పుల్లో ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల మాల్దీవులకు వెళ్లి బాగా ఎంజాయ్ చేసింది. 
 
అక్కడ బికినీల్లో దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులకి మరింత హీట్ పుట్టించింది. ఇక తాజాగా మరో సారి టూర్ కి వెళ్ళింది. అయితే ఈ సారి ఫ్యామిలీతో కలిసి విహార యాత్ర ప్లాన్ చేసుకుంది పూజ
 
తన ఫ్యామిలీతో కలిసి మాల్దీవులకు విహార యాత్రకి వెళ్ళింది పూజా హెగ్డే. అక్కడ ఫ్యామిలీతో కలిసి దిగిన ఓ ఫోటోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 
 
తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసి.. "13 ఏళ్ళ తర్వాత కుటుంబంతో విహారయాత్రకు బయటకి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. చాలా గ్యాప్ తర్వాత వెళ్తున్న ఈ టూర్ చాలా ముఖ్యం అంటూ చెప్పుకొచ్చింది.