శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (10:12 IST)

ప్రిన్స్ మహేష్ బాబు-పూజా హెగ్డె జంటగా త్రివిక్రమ్ చిత్రం ప్రారంభం

మహేష్ బాబు 28వ చిత్రం ‘SSMB 28’ గురువారం హైదరాబాద్‌లో ‘ముహూర్తం’ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. కమర్షియల్ యాక్షన్ డ్రామాగా చెప్పబడుతున్న కొత్త వెంచర్ కోసం మహేష్- త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి జతకట్టారు.

 
భారీ అంచనాల మధ్య లాంచ్ అయిన చిత్రం వేడుకకు సంబంధించిన కొన్ని చిత్రాలు, వీడియోలు ట్విట్టర్‌లో వచ్చాయి. ఈ కార్యక్రమానికి మహేష్ బాబు రాలేదు. ఆయన తరపున ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ పూజా కార్యక్రమానికి హాజరయ్యారు.

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం ‘రాధే శ్యామ్’లో కనిపించనున్న నటి పూజా హెగ్డే మహేష్ బాబుతో ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. మహేష్ బాబు క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని త్రివిక్రమ్ శ్రీనివాస్ కథను సిద్ధం చేసినట్లు సమాచారం.

 
హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించనున్నారు. ఇతర సాంకేతిక వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. ‘SSMB28’ ఈ మార్చిలో సెట్స్‌పైకి రానుంది.