1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 28 జనవరి 2022 (17:10 IST)

దిల్‌దార్‌ బనే దే ప్రచారం: అమితాబ్‌- పూజాహెగ్డేలను ఒకే దరికి తీసుకువచ్చిన మాజా

కోకా-కోలా ఇండియా యొక్క దేశీయంగా అభివృద్ధి చేసిన మామిడి పానీయం, మాజా తమ తాజా ప్రచారం దిల్‌దార్‌ బనే దేను ఆంధ్రప్రదేశ్‌- తెలంగాణా రాష్ట్రాలలో నేడు విడుదల చేసింది. ఈ నూతన టీవీసీలో పలు తెలుగు, హిందీ చిత్రాలలో నటించిన సుప్రసిద్ధ భారతీయ నటి, మోడల్‌ పూజా హెగ్డే కనిపించనున్నారు. ఈమెతో పాటుగా మహోన్నత నటుడు,  బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ సైతం కనిపించనున్నారు. ఈ నూతన టీవీసీని టీవీ, డిజిటల్‌, రేడియోలో 360 డిగ్రీ విధానంతో ప్రసారం చేయనున్నారు.

 
మాజా యొక్క నూతన దిల్‌దార్‌ బనే దే ప్రచారంలో పండ్లలో రారాజు, సంపద దాణగుణంకు ప్రతీకగా నిలిచే-మామిడితో ఔదార్యపు స్ఫూర్తిని అత్యంత అందంగా ఒడిసిపట్టే ప్రయత్నం చేశారు. దీనియొక్క సృజనాత్మక నేపథ్యీకరణతో, ఉదాత్తత మరియు దయతో ఇతరులకు సహాయం చేయడానికి తరచుగా తమ మార్గం నుంచి బయటకు వచ్చే వ్యక్తులను ఇది ప్రతిధ్వనింపజేస్తుంది.

 
ఈ బ్రాండ్‌ ప్రధాన లక్ష్యం, దేశం అభిమానించే మామిడి పానీయంగా తమ స్థానం కొనసాగించడం. ఈ పానీయాన్ని అత్యంత రుచికరమైన మామిడి పళ్లతో తయారుచేస్తారు. వీటిని భారతీయ రైతుల నుంచి సేకరిస్తారు. ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణాలలో స్థానిక సంస్కృతి, సంప్రదాయాలపై ఆధారపడి హైపర్‌ లోకల్‌ విధానంను బలోపేతం చేసుకుంటుంది. భారతీయ నటి పూజా హెగ్డేను మాజా నూతన ప్రచారకర్తగా ఎంచుకోవడమనేది ఈ లక్ష్యంకు అనుగుణంగా ఉంటుంది.

 
ఈ నూతన ప్రచారం విడుదల సందర్భంగా అజయ్‌ కొనాలీ, డైరెక్టర్‌ మార్కెటింగ్‌, న్యూట్రిషన్‌ కేటగిరి, కోకా కోలా ఇండియా అండ్‌ సౌత్‌ వెస్ట్‌ ఆసియా మాట్లాడుతూ, ‘‘మన దేశపు వారసత్వ బ్రాండ్‌ మజా. 1976 నుంచి ఇది భారతదేశంలో ఎక్కువ మంది అభిమానించే మ్యాంగో డ్రింక్‌గా వెలుగొందడంతో పాటుగా భారతదేశంలో కంపెనీ పోర్ట్‌ఫోలియోలో శక్తివంతమైన బ్రాండ్‌గా నిలిచింది. సాటిలేని రీతిలో అసలైన, ఆధీకృత మామిడి పళ్ల రుచికి మాజా సుప్రసిద్ధం. మామిడి విభాగంలో సుప్రసిద్ధమైన బ్రాండ్‌ ఇది.


ఈ నూతన పొజిషనింగ్‌తో, ఇప్పుడు మేము బ్రాండ్‌ యొక్క మహోన్నత కారణాన్ని లక్ష్యంగా చేసుకోవడంతో పాటుగా ఔదార్యం, దిల్‌దారికి ప్రతిరూపంగా మారుస్తున్నాం.  శ్రీ బచ్చన్‌ మరియు కుమారి పూజా హెగ్డేలు మాతో చేతులు కలుపడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం. మాజా యొక్క మారుతున్న సిద్ధాంతంను వీరు మరింతగా వెలుగులోకి తీసుకురానున్నారు’’ అని అన్నారు.

 
ఆయనే మాట్లాడుతూ ‘‘భారతదేశంలో మాకు అత్యంత కీలకమైన మార్కెట్‌లుగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా నిలుస్తున్నాయి. ఈ కారణం చేతనే మేము దిల్‌దారీ ప్రచారం ఇక్కడ నుంచి ప్రారంభించాము’’ అని అన్నారు. ఆకట్టుకునే ఈ టీవీసీలో పూజా హెగ్డే, తమ  చుట్టుపక్కల పిల్లలతో కలిసి ఆడుతూ ఆనందిస్తుంటారు. ఆమె అనుకోకుండా బాల్‌ను గ్రౌండ్‌ బయటకు కొడతారు. అది వెళ్లి అమితాబ్‌ బచ్చన్‌ ఇంటిలో పడుతుంది. ఆయన ఈ చిత్రంలో ఓ సీనియర్‌ సిటిజన్‌గా కనిపిస్తారు. అతని ఇంటిలో పడిన ఏ ఒక్కబాల్‌ తిరిగి ఇవ్వని కారణంగా పిల్లలకు అతనంటే కోపం. అయితే అతను ఓ మజా బాటిల్‌ రుచి చూసిన తరువాత పూర్తిగా మారిపోతారు. తన హృదయాన్నీ తెరుస్తారు. బచ్చన్‌ నుంచి దిల్‌దారీ చర్యతో ఈ చిత్రం ముగుస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా తన ఇంటిలో పడిన బాల్స్‌ కలెక్షన్‌ను ఇచ్చేస్తారు.

 
ఈ నూతన మాజా ప్రచారం గురించి భారతీయ నటి పూజా హెగ్డే మాట్లాడుతూ ‘‘నా చిన్నతనం నుంచి కూడా తాగడాన్ని ఇష్టపడే బ్రాండ్‌కు ముఖ చిత్రంగా నిలిచే అవకాశం లభించడం ఓ అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ప్రచారం నా హృదయానికి దగ్గరగా ఉంది. అంతేకాదు,నా అభిమాన నటుడు, స్ఫూర్తిప్రదాత శ్రీ బచ్చన్‌తో కలిసి నటించే ప్రత్యేక అవకాశం కూడా నాకు లభించింది. అంతేకాదు, హిందీ సినిమాలో మహోన్నత దర్శకులలో ఒకరైన షూజిత్‌ సర్కార్‌తో కలిసి చేసే అవకాశం కూడా లభించింది. ఈ ప్రచార చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ దాతృత్వం, ఉదారతతో పాజిటివిటీ మరియు హ్యుమానిటీని వ్యాప్తి చేయడానికి ప్రేరణ పొందుతారని ఆశిస్తున్నాను’’ అని అన్నారు.

 
దశాబ్దాలుగా, మాజా తమ వినియోగదారులకు అత్యుత్తమ మామిడి అనుభవాలను అందించడం ద్వారా మనసు, శరీరం, ఆత్మను ఆహ్లాదపరుస్తుంది. ఈ వారసత్వ బ్రాండ్‌ దేశవ్యాప్తంగా తమ వినియోగదారుల వేడుకలు, ఉత్సవాలు మరియు సంతోషపు  క్షణాలలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఈ నూతన సంవత్సరం, ఈ బ్రాండ్‌ తమ వినియోగదారుల నడుమ సానుకూలత, శ్రేయస్సు, గొప్పతనాన్ని వ్యాప్తి చేయడం ద్వారా  తమ ఉద్దేశ్యాన్ని పునరుజ్జీవింపజేస్తోంది.