అమితాబ్ బచ్చన్‌తో నటించాలనే కల నెరవేరింది- పూజా హెగ్డే
Amitabh Bachchan, Pooja Hegde
పూజా హెగ్డే మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో స్క్రీన్ స్పేస్‌ను పంచుకోవాలనే కల నెరవేరినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. కోకో-కోలా కంపెనీకి చెందిన మాజా డ్రింక్ యాడ్‌లో బిగ్ బితో ఆమె నటించింది. తన ఇంటిపక్కన పిల్లలతో క్రికెట్ ఆడుతుండగా బాల్... ఎదురుగా వున్న అమితాబ్ ఇంటిలో పడుతుంది. దాన్ని ఇవ్వమని పూజా అడిగితే, మాజా ఇస్తే ఇస్తానని అనడంతో మజా డ్రింక్‌ను విసిరి వేయగా బిగ్ బి పట్టుకుంటాడు. అప్పుడు ఆయన తాగిన తర్వాత వ్యక్తం చేసిన అనుభూతి తనలోను దిల్‌దార్‌గా తాగుతున్నటప్పుడు కలిగిందని పూజా పేర్కొంది.
గతంలోనే అమితాబ్‌తో పార్క్‌లో కుర్చీలో కూర్చున్న ఫొటోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అప్పుడు ఆ వివరాలు త్వరలో చెబుతానని పేర్కొంది. ఇప్పుడు ఆ వివరాలు తెలియజేసింది.
ముందుగా ఆంధ్ర, తెలంగాణాలో 2022 న్యూ బ్రాండ్‌ను ప్రవేశపెడుతున్నారు. కోకా-కోలా ఇండియా సౌత్ వెస్ట్ న్యూట్రిషన్ కేటగిరీ, మార్కెటింగ్ (డైరెక్టర్ అజయ్ కొనాలే ఈ సందర్భంగా పూజతో శుక్రవారం వర్చువల్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా పూజ మాట్లాడుతూ, బిగ్ బితో కలిసి నటిస్తానని అస్సలు ఊహించలేదు. డెస్టినీకి థ్యాంక్స్ చెబుతున్నా. నాకు చిన్నప్పటినుంచి మజా డ్రింక్ అంటే ఇష్టం. మా అమ్మకు మరీ ఇష్టం. పండ్లలో రారాజు మామిడికాయ. దాని జ్యూస్ మరి ఇష్టం. చిన్నతనంలో ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు చాక్లెట్ తినేదానిని. ఇంకోవైపు మజా ఎక్కడుందో చూసేదానిని. మా కుటుంబంలో అందరూ మజాను ఇష్టపడతారు. అందుకే ఈ జ్యూస్ ప్రమోషన్‌లో పాల్గొంటున్నానని అనగానే అందరూ గౌరవంగా ఫీలయ్యారు. అందులో అమితాబ్‌తో నటించడం మరో అనూభూతి.
అమితాబ్ నుంచి చాలా నేర్చుకున్నాను. ఇంత వయస్సులో కూడా ఆయన సమయపాలన, డెడికేషన్ నాకెంతో నచ్చాయి. నేను లాంగ్ రోడ్ జర్నీ చేసినా మాజా డ్రింక్ వుండేలా చూసుకుంటాను. సినిమా రంగంలో తెలుగు ప్రేక్షకులు చూపిన ఆదరణ మర్చిపోలేను. మంచి విజయాలు తెలుగులో వచ్చాయి. ఆంధ్ర, తెలంగాణలలో మజా డ్రింక్ కొత్త బ్రాండ్ విడుదల కావడం కూడా చాలా ఆనందాన్ని కలిగించిందని తెలిపారు.
కోకా కోలా సౌత్ మార్కెటింగ్ (డైరెక్టర్ అజయ్ కొనాలే మాట్లాడుతూ, రుచికరమైన జ్యూస్‌లో మాజా పేరెన్నికగన్నది. 10 ఏల్ళుగా బిజినెస్ అభివృద్ధి చెందుతూ వుంది. ఈసారి అమితాబ్, పూజ వల్ల డబుల్ అవుతుందని నమ్ముతున్నాను. ముఖ్యంగా తెలుగువారికి మామిడి జ్యూస్ అంటే ఇష్టం. అందుకే 2022లో కొత్త రుచిని వారిని చూపించబోతున్నాం. అంతర్జాతీయ గైడ్‌లైస్ ప్రకారం జ్యూస్ నిల్వలు చేస్తాం. ఇందుకు మామిడి రైతుల దగ్గరనుంచి పండ్లు తీసుకుంటాం. మామిడిలో ఎన్నో రకాలుండగా రెండు ప్రత్యేకమైన రకాలను మాత్రమే మాజా డ్రింక్‌కు ఉపయోగిస్తామని తెలిపారు.