మంగళవారం, 12 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (19:02 IST)

అర‌బిక్ సాంగ్‌కు డాన్స్ చేస్తూ యూత్‌ను ఫిదా చేసిన‌ నభా నటేష్

Nabha Natesh dance
రామ్‌తో ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో న‌టించిన నభా నటేష్ మంచి డాన్స్‌ర్‌. ఆ సినిమాలో బాగానే డాన్స్ చేసి అల‌రించింది. కానీ అంత‌కుమించి అన్న‌ట్లుగా అర‌బిక్ పాట‌కు న‌డ‌మును గుండ్రంగా తిప్పుతూ యూత్‌ను అల‌రించేలా డాన్స్ చేసి ఆక‌ట్టుకుంది. త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ ద్వారా అరబిక్ కుతుకు తన సిజ్లింగ్ వీడియోను పోస్ట్ చేసింది.
 
Nabha Natesh dance
ఇది త‌మిళ విజయ్ హీరోగా నటించిన బీస్ట్ చిత్రం నుండి అరబిక్ కుతు అని కూడా పిలువబడే హలమతి హబీబో సంచలన విజయం సాధించింది. ఈ పాట అనేక కొత్త రికార్డులను సృష్టించింది. ఈ సాంగ్‌ను చాలా మంది సెలబ్రిటీలు స‌ర‌దాగా చేసి సోష‌ల్ మీడియాలో పెట్టుకున్నారు. ఇక న‌భా కూడా  తన సిబ్బందితో కలిసి, పాటలోని హుక్ స్టెప్‌ను చేసింది. డ్యాన్స్ వీడియో కొద్ది సేపటికే వైరల్‌గా మారింది. నభా నటేష్ చివరిసారిగా నితిన్ యొక్క మాస్ట్రోలో కనిపించింది.