శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 ఏప్రియల్ 2022 (18:44 IST)

Hari Hara VeeraMallu నుంచి అదిరే వీడియో (Video)

hari hara veera mallu
వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లాంటి వరుస విజయాల తర్వాత ఆయన నటించే తర్వాతి చిత్రంపై ఆసక్తి నెలకొంది. అదే హరిహరవీరమల్లు. పీరియాడికల్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ వజ్రాల దొంగ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. 
 
పీరియాడికల్ యాక్షన్‌గా ఇది తెరెకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇందులో ఎక్కువ పోరాట సన్నివేశాలున్నట్లు తెలుస్తుంది.
 
పవన్ కల్యాణ్ యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రాక్టీసులో నిమగ్నమయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను చిత్రబృందం సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంది. తాజాగా సదరు పిక్స్‌లోని యాక్షన్ మూవ్‌మెంట్స్‌తో ఓ వీడియో ఇప్పుడు అభిమానులకు ఆనందం పంచుతోంది.
 
ఇంతకు ముందు నటసింహం నందమూరి బాలకృష్ణతో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి హిస్టారికల్ మూవీ రూపొందించి విజయం సాధించారు క్రిష్. ఆ అనుభవంతోనే ఈ సారి కూడా ‘హరి హర వీరమల్లు’లో 17వ శతాబ్దం నాటి మొఘల్ సామ్రాజ్యం నేపథ్యాన్ని ఎంచుకున్నారు.
 
ఇందులో మొఘల్ పాలకులకు ముచ్చెమటలు పట్టించిన వీరుడు ‘హరి హర వీరమల్లు’గా పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. అందుకోసం ఆయన పోరాట సన్నివేశాల సాధన చేశారు.
 
అప్పుడు తీసిన వీడియోనే ఇప్పుడు ఇలా సందడి చేస్తోంది. చివరలో పవన్ కళ్యాణ్ గాల్లోకి ఎగిరి ప్రత్యర్థిని కొట్టేలా చేసిన ఫీట్ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.